గంట్యాడ మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్య శాల వద్ద మంగళవారం మధ్యాహ్నం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గంట్యాడ, జామి మండలాలకు చెందిన పశు వైద్యాధికారులు, పశువైద్య సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రెడ్డి కృష్ణ పాలు విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి కృష్ణ మాట్లాడుతూ, పాడి రైతులకు మరింత చేరువగా పశువైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గంట్యాడ జామి మండలానికి చెందిన పశువైద్యాధికారులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.