తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరులో శుక్రవారం ఓ లారీ అదుపుతప్పి బ్రిడ్జి కిందికి దూసుకెళ్లింది. అధిక వేగంతో రావడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం లోఎవరికి ఎటువంటి గాయాలే కాలేదు. దీనితో అందరు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు క్రెనుల సహాయం తో లారీని పక్కకు తొలగించారు.