ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బుధవారం ఊయల వినాయకుడిని ఏర్పాటు చేశారు. పట్టణంలో ఆకట్టుకునే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఊయల భక్తులు ఊపేలా తాడు ఏర్పాటు చేయడంతో ఉయ్యాలలో ఊగుతున్నావు వినాయకుడి ఊయలను ఊపి భక్తులు తరిస్తున్నారు.