దేవరకద్ర మండల పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టులో గురువారం నాటికి 13 అడుగుల మేర నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.ఆయకట్టు యాసంగి పంటకు కుడి,ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ప్రస్తుతం నీటిని విడుదల నిలిపివేశామని,మిగిలిన నీటిని మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు అధికారులు రాత్రి 7 గంటలకు ఒక ప్రకటనలో వెల్లడించారు.