తొలగించిన వికలాంగుల పెన్షన్ వెంటనే పునరుద్ధరించాలని వికలాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక నాయకులు మరియు డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం నందు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల అంగవైకల్యం పెన్షన్లు తొలగించి వారి కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తొలగింపు పేరుతో రీ వెరిఫికేషన్ పేరుతో పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా పెన్షన్లు తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 100% ఉన్న వికలాంగులను కూడా పెన్షన్ తొలగిం