'టైలరింగ్ పనిచేస్తూ.. టీచర్ ఉద్యోగం సాధించాడు’ టైలరింగ్ పనిచేసే నసీరుద్దీన్ డీఎస్సీలో సత్తాచాటి టీచర్ ఉద్యోగం పొందారు. శిరివెళ్లకు చెందిన నసీరుద్దీన్ హిందీ (ఎస్ఏ)లో 82.37 మార్కులతో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నెరవేరిందని నసీరుద్దీన్ అన్నారు. ఆయనను పలువురు అభినందించారు.