భూపాలపల్లి జిల్లాలోని మహా ముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి చెందిన రైతులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకాడ్లు పట్టుకొని ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా గ్రామంలో భూములను దున్నుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల కొందరు భూస్వాములు ఈ భూములు మావే అంటూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని,ఈ విషయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ భూములు రక్షించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు రైతులు.