గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నీట మునిగింది. కళాశాలకు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా నీటిమనడంతో రోడ్డును మూసివేశారు కాలేజీలోకి వెళ్లాలంటే వెనుక నుండి వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 3:20 మీడియాతో తెలిపారు. కళాశాలలోకి నీరు చేరడంతో పాములు తేళ్లు వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేశారు.