వరదయ్యపాళెం: 'అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు' ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ SI రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మండలంలోని పలు షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రికార్డులు సరిగా లేని రూ. 11,69,893 విలువగల పలు ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. రికార్డులు సరిగా నిర్వహించక పోయినా, పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసినా, ఏదేని కంపెనీలకు విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.