ఇటీవలే ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనం చోరీకి గురైందని ఏరువ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గుంటూరు వెస్ట్ డిఎస్పి అరవింద్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వరుస బైకు చోరీలపై నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. నేడు అనగా 24.08.2025 ఆదివారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగిందన్నారు.