జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన ఓర్సు లింగయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన జైదా రామకృష్ణ పొలంలో నాటు వేయడం కోసం వచ్చిన కూలీలను సోమవారం ఉదయం ట్రాక్టర్ నెంబర్ టిఎస్ 02UE 1140 అనే నెంబర్ గల గల దానిలో తీసుకొని వారిని పొలం వద్ద దింపి తిరిగి వస్తూ ఉండగా చెరువు కట్టపై చేరుకునేసరికి అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో ట్రాక్టర్ చెరువు కట్ట పైనుండి చెరువులోకి బోల్తాపడటంతో తన తండ్రి ఓర్సు లింగయ్య మృతి చెందాడని మృతిని కొడుకు ఓర్సు రాజకుమార్ సోమవారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.