తెల్లవారుజాము నుండి కొత్త మావాస్య వేడుకలను పురస్కరించుకొని నూకాంబిక అమ్మవారి ఆలయాల్లో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో ఆలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. అత్యధిక సంఖ్యలో తరలివస్తున్న భక్త జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఎలమంచిలి మండలంలో పెదపల్లి తదితర గ్రామాల్లో పండుగను వైభవంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు.