టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని లిఫ్ట్ గత మూడు రోజులుగా పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం ఐపీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు మొదటి, రెండో అంతస్తు నుంచి రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్ట్ ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురి అవుతుందని పలువురు రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. లిఫ్ట్ పనిచేయక అటు ఆసుపత్రి సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు.