భోగాపురం ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న మోటార్ బైక్ అదుపుతప్పి రెండు రోడ్ల మధ్య ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తగరపువలసఎన్నారై ఆసుపత్రికి తరలించారు.