Parvathipuram, Parvathipuram Manyam | Aug 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో గురువారం మున్సిపల్ కుళాయిలు ద్వారా తాగునీటి సరఫరా జరగదని మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వేగావతి నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఇన్ ఫిల్టరేషన్ బావులలోనికి వరద నీరు చేరడంతో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి పట్టణవాసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.