నెల్లిమర్ల పట్టణంలోని గుర్తు తెలియని ఓ ప్రేమికుల జంట ప్రేమలో మునిగిపోయారు. అది బయట ఎక్కడో అయితే ఇలా చెప్పుకునే పనే లేదు.. వాళ్ల ప్రేమకు ఏకంగా రైల్వే ట్రాక్ నే ఆశ్రయం చేసుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని స్థానిక జగనన్న కోలనీ వద్ద గురువారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది. ఓ ప్రేమికుల జంట రైల్వే ట్రాక్ పై కూర్చొని పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకున్నారు. ఇది చూసిన స్థానికులు చనిపోవడానికి ఏమైనా ట్రాక్ పై కూర్చున్నారేమో అని ఆందోళన చెందారు. అయితే రైలు వచ్చినప్పుడు లేవడం వెళ్లిపోయిన తరువాత మళ్లీ ట్రాక్ పై కూర్చోవడంతో ప్రేమ బంధమని స్పష్టతకు వచ్చారు.