మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వన్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అవనీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.