మెట్పల్లి గురుకుల పాఠశాలల తనిఖీ మెట్పల్లిలోని తెలంగాణ మైనార్టీ సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలను ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ మోహన్తో కలిసి ఆయన ఆహార మెనూ, తరగతి గదులు, వంట గదులు, స్నానపు గదులు, నీటి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.