ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం సమీపంలో టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేకు మట్టి సరఫరా చేసే టిప్పర్ లారీ స్టీరింగ్ పట్టేయడం వల్ల అదుపుతప్పి బోల్తా పడినట్లుగా టిప్పర్ లారీ డ్రైవర్ తెలిపాడు. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణా నష్టం కానీ జరగలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.