ప్రకాశం జిల్లా కొండపి మండలం కే.ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు HM సుసన్న కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీనియర్ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం, విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. SMC ఛైర్మన్ రాఘవేంద్ర శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.