జిల్లాలోని ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యుల నియామకం ప్రక్రియ చేపట్టడం జరిగిందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసిఫాబాద్ జిల్లాలో గల ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆసుపత్రులలో పని చేసేందుకు 23 సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఎం.బి.బి.ఎస్. పోస్టుల భర్తీ కొరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకుల ఆధ్వర్యంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ భవనంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఇంటర్వ్యూకు 15 మంది హాజరయ్యారన్నారు.