ఐజ మండల పరిధిలోని బింగి దొడ్డి గ్రామంలో రహదారిపై నీరు నిలవడంతో గ్రామస్తులు వరి నాట్లను వేసి నిరసనలు తెలిపారు. సరైన డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో ఇల్లలోకి నీరు ప్రవేశించి ఇబ్బందులకు గురవుతున్నామని సరైన రహదారులు, డ్రైనేజీర్లు లేకపోవడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షులు గోపాల కృష్ణ అగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.