శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం పంచాయతీ ఏటిగడ్డ తాండాకు చెందిన 6 మంది స్కార్పియో వాహనంలో వెళ్తుండగా పులివెందుల పట్టణ సమీపంలోని రాయలపురం బ్రిడ్జి కాలువలోకి ప్రమాదవశాత్తు వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కిరణ్, శ్రీనివాస్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్ నాయక్, మహేంద్ర బాబులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు.