యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పోలీస్ అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా బీబీనగర్ పెద్ద చెరువు వద్ద శుక్రవారం నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు అధికారులకు ఏర్పాటుపై పలు సలహాలు సూచనలను చేశారు .ఈ కార్యక్రమంలో భువనగిరి జోన్ డిసిపి ఏసిపి సీఐలు ఎస్సైలు తదితరులు ఉన్నారు.