సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మూసాపేటలోని రాయల్ ఫంక్షన్ హాల్లో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో వితంతువులకు, వృద్ధులకు 4000, వికలాంగులకు 6000 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు.