ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో పంట రుణాలు తీసుకున్న 1189 మంది రైతులు నెలలుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. అనేక విన్నపాల తర్వాత కూడా చర్యలు లేకపోవడంతో రైతులు బుధవారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసి సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. వందమందిని వస్తామన్న జల రైతుల సమస్యను పరిష్కరించండి అన్న ప్లీజ్ అంటూ మల్లారెడ్డి విన్నవించారు.