క్రీడల ద్వారా క్రీడాకారులకు మంచి గుర్తింపు వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఏపీఎస్పీ కమాండెంట్ దేవేంద్ర పేర్కొన్నారు. కాకినాడ రూరల్ జిల్లా క్రీడా మైదానంలో ప్రపంచ క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలకు విద్యా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందన్నారు క్రీడల ద్వారా దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు.