జిల్లాలో యూరియా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో యూరియా లభ్యత నానో యూరియా వాడకం చెక్పోస్ట్ ల ఏర్పాటు తదితర అంశాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత లేదని భరోసాను రైతులకు కల్పించాలని అన్నారు యూరియా కొరత లేకుండా చూడాలని అన్నారు