నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా తొలగించాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ పారిశుధ్యం పై హెల్త్ అధికారులు పన్నుల వసూలు పై రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలు తదితరాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కమిషనర్కు వివరించారు.