ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం మండలంలోని ధనోర గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఓ వాహనంపై గుడిహత్నూర్ నుంచి వస్తున్న ఇద్దరు యువకులు, మరో వాహనంపై ఉట్నూరు మండలం ఉమ్రి తండా నుండి ముగ్గురు కుటుంబ సభ్యులు వస్తున్న క్రమంలో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు.