కళ్యాణదుర్గం మండలం సిబాయి గ్రామం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు గమనించారు. వాహనాన్ని ఆపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే తన వాహనంలో ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్పించారు. ఎమ్మెల్యే మానవత్వం చూపడంతో అందరూ మెచ్చుకున్నారు.