సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపల్ పరిధిలోని క్రిస్టియన్ కాలనీ, అల్లిపూర్ వెళ్లే రహదారి గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు మహిపాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద కాలనీవాసులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్టియన్ కాలనీ ,అల్లీపూర్ వెళ్లే దారి ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించాలని వర్షానికి భారీగా గోతులు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు అన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి నూతన రోడ్డును ఏర్పాటు చేయడంతో పాటు, మురుగునీటి కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.