కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా విషయంలో నీళ్లు రావడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తే అదే నీళ్లలో ముంచి వస్తుందో లేదో చేపిస్తామంటూ మండిపడ్డారు. రాజకీయాలను పక్కనపెట్టి కుప్పం అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ వైసీపీకి హితవు పలికారు.