ఐఆర్సిటిసి తమ ప్రత్యేక పది రోజుల భవ్య గుజరాత్ యాత్ర పర్యాటక రైలును అక్టోబర్ 7న తిరుపతి నుంచి ప్రారంభించనుంది ఆధ్యాత్మిక మరియు వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఐఆర్సిటిసి తొలిసారి పది ప్రత్యేక రైలు ప్రవేశపెడుతోంది ఒక్కో రైలు 639 మంది యాత్రికులను తీసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఐఆర్సిటిసి ఏరియా మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం రైల్వే స్టేషన్లో స్టేషన్ డైరెక్టర్ కుప్పల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు 1999లో ఐఆర్సిటిసి పర్యాటక సేవలను ప్రారంభించిందని 2008లో మినీ రత్న పురస్కారాన్ని సాధించిందని 2025లో నవరత్న హోదాను పొందింది అని చెప్పారు.