నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించాలని కార్పొరేషన్ కమిషనర్ నందన్ అధికారుల ఆదేశించారు. అనుమతులను మించి నిర్మించిన కట్టడాలను తొలి దశలోనే నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలు జరపకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని, అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు స్పష్టం చేశారు.