యానాం కనకాలపేట వాటర్ ట్యాంక్ లో క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఐదు గంటల సమయంలో వాటర్ ట్యాంక్ లో సిలెండర్ మారుస్తుండగా క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో రక్షిత మంచినీటి సరఫరా శాఖ సిబ్బంది ఇద్దరు సృహ తప్పి పడిపోగా, మిగిలిన సిబ్బంది బయటకు పరుగులు తీసారు. వాటర్ ట్యాంక్ చుట్టూ వంద మీటర్ల పరిధిలో క్లోరిన్ గ్యాస్ వాసన వెదజల్లుతుండడంతో స్దానికులు ఆందోళన వ్యక్తం చేశారు.