గంజాయి వాడకంతో కలిగే అనర్థాలు గురించి విద్యార్థులకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఎవరైనా గంజాయి కేసులో ఉంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని అన్నారు.