ట్రంప్ విధిస్తున్న శుంకాలను వ్యతిరేకిస్తూ కూనవరం జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడాలని సార్వభౌమత్వ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాబు బొర్రయ్య జిల్లా కమిటీ సభ్యులు సీతారామయ్య సర్పంచులు మడకం నాగమణి బొగ్గరామారావు మండల కమిటీ సభ్యులు తాలూరి శ్రీనివాసరావు శాఖ కార్యదర్శి కొండఈశ్వరులు తాళ్లూరి రామారావు తెలగాన్ని నాగరాజు మైనారిటీ నాయకులు యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.