కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కసాపురం దేవస్థానం ఈఓ విజయరాజు గారు పట్టు వస్త్రాలు సమర్పించగా, కాణిపాకం దేవస్థానం ఈఓ పెంచల కిషోర్ గారు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.