వినాయక నిమజ్జనం ఊరేగింపుల్లో ఆల్కహాలు తాగడం రాష్ డ్రైవింగ్ చేయడం మంచిది కాదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మాదాసు భాను ప్రసాద్ అన్నారు. చిలకలూరిపేట లోను తన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ డీజేల వల్ల వచ్చే శబ్దాలు గుండెపొటుకూ కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైందవ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే పూజార్లు కమిటీ నిర్వాహకులు ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.