ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలో ఏపీ వాటాగా 37.31 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నట్లు ఏపీ జెన్కో అధికారులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు బలిమెల జలాశయంలో 65.73 టీఎంసీలు నీటి నిలవలు ఉండగా ఏపీ వాటాగా 37.31 టీఎంసీలు ఒడిస్సా వాటాగా 28.42 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆంధ్ర అవసరాల నిమిత్తం 2500 క్యూసెక్కులు,ఒడిస్సా అవసరాలను నిమిత్తం 4000 క్యూసెక్కులు నీటిని వాడుకుంటున్నట్టు అధికారులు తెలిపారు