అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు ఢీకొనడంతో స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందారు అని పోలీసులు తెలిపారు. అప్పయ్యరాజు పేట వద్ద పెట్రోల్ బంకు నందు వర్కర్ గా పనిచేస్తున్న పుత్తనవారి పల్లె గ్రామ నివాసి ఉమ్మడి శ్రీను(40) డ్యూటీకి వెళుతుండగా లారీ ఢీకొనడం వల్ల మృతి చెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.