ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సిఐటియు కార్యాలయంలో సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి స్ఫూర్తితో భవిష్యత్తు కార్యాచరణ నిర్వర్తించడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్స్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.