ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని అన్నారు. నోటీసులు వచ్చిన ఎమ్మెల్యేలు దానికి సమాధానం ఇస్తున్నారని అలాగే నాకు నోటీసులు వచ్చాక లీగల్ ఒపీనియన్ తీసుకొని స్పీకర్కు సమాధానం ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.