ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ సమీపంలోని ఓ నిర్మానుష ప్రదేశంలో వ్యక్తి ఉరి వేసుకున్న విషయాన్ని గురువారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి గతంలో కూడా మతిస్థిమితం కోల్పోయి గతంలో పలుమార్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.