గంట్యాడ మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా గంట్యాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భారీగా చేరిన వర్షం నీరు చెరువు మాదిరిగా దర్శనం ఇస్తోంది. గత నెలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గంట్యాడ హై స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో హై స్కూల్ గ్రౌండ్ లో నీరు నిల్వ ఉండడాన్ని గుర్తించి, మట్టితో ఎత్తు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికార యంత్రాంగం బేకాతర్ చేయడం వల్ల సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో హై స్కూల్ గ్రౌండ్ లో వర్షం నీరు చెరువు మాదిరిగా తిష్ట వేసింది.