గుంటూరు నగరంలో ఈ నెల 10వ తేదీ నాటికి వీధి దీపాల మరమత్తులు నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధికారులు వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 10వ తేదీ అనంతరం స్తంభాలకు లైట్లు ఉండి వెలగకపోతే ఎమినిటి కార్యదర్శి, ఏఈనే భాధ్యత వహించాలని స్పష్టం చేశారు.