పెదపారుపూడి మండలం యలమర్రులో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. నిమజ్జనంలో పాల్గొన్న రాము (40) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.