ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వ్యాపారస్తులకు షాపు యజమానులకు ఎస్ఐ మురళి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుందన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కు దారితీస్తుంది అన్నారు. కనుక దుకాణ యజమానులు వ్యాపారస్తులు పార్కింగ్ ప్లేస్ ను వారి దుకాణాల వద్దని ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు వ్యాపారస్తులు పోలీసులు సహకరించాలని కోరారు.