వికారాబాద్ జిల్లాపరిధిలో పలు గ్రామాలలో గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా సాంప్రదాయాన్ని కనుమరుగు కాకుండా భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, కోలాటం చెక్కభజన లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా నిమజ్జన ఊరేగింపు శోభయమానంగా నిర్వహించారు. అనంతరం స్థానిక చెరువులు నిమజ్జన మహోత్సవ కార్యక్రమాన్ని చేశారు.